MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

పెనమలూరు, కంకిపాడు మండలాల్లో సిమెంటు మాయంపై నివేదిక కోరిన రాష్ట్ర ఉపలోకాయుక్త

  • October 16, 2026
  • 0 min read
పెనమలూరు, కంకిపాడు మండలాల్లో సిమెంటు మాయంపై నివేదిక కోరిన రాష్ట్ర ఉపలోకాయుక్త

గౌరవ ఉపలోకాయుక్త కేసు నెం. 1956/2026/బి2

ఉయ్యూరు:

కృష్ణా జిల్లా పరిధిలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాలకు సంబంధించి సుమారు 250 టన్నుల ఇనుము మాయం కావడంపై రాష్ట్ర ఉపలోకాయుక్త జస్టిస్ పి. రజని తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి హెప్సీబా రాణి కోర్లపాటిని ఆదేశిస్తూ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిర్యాదు నేపథ్యం:

ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ గత జూన్ 22, 2026న ఈ అక్రమాలపై రాష్ట్ర ఉపలోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పమిడిముక్కల మండలంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు గాను అక్కడి గోడౌన్‌కు ఇనుము, సిమెంటు నిల్వలు కేటాయించారు. అయితే, వాటిని కంకిపాడు గోడౌన్‌లో దించి, దాదాపు 50 టన్నుల ఇనుము మరియు 1,200 బస్తాల సిమెంటును గృహ నిర్మాణ శాఖ సిబ్బంది మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణకు లోకాయుక్త ఆదేశాలు:

ఈ అక్రమాలపై గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఉయ్యూరు డి.ఇ. శివ ప్రసాద్, ఎ.ఇ లపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో, బాధ్యులపై విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి హెప్సీబా రాణి కోర్లపాటి ని ఆదేశిస్తూ గౌరవ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.

About Author

SSN