MachilipatnamLocal News
October 23, 2026
జిల్లా

బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ

  • October 23, 2026
  • 1 min read
బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ శుక్రవారం మచిలీపట్నం నగరంలోని రుస్తుంబాద మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో నేలపై కలసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు.

ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, నాణ్యతా ప్రమాణాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రోజూ విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల పరిసరాలు, వంట గది పరిశుభ్రత మరియు భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం సూచించిన మెనూను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను, వంట పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN