మచిలీపట్నంలో ఘనంగా ‘జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం’
మచిలీపట్నం:
మచిలీపట్నంలోని పాండురంగ హైస్కూల్లో ‘జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం’ (National Deworming Day) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ లోక్నాథ్ దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు కృష్ణా జిల్లా ఆర్బీఎస్కే (RBSK) ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ఆవశ్యకతపై అధికారు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ (Albendazole) మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ — “1 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, యువత అందరికీ ఈ ఆల్బెండాజోల్ మాత్రలు వేయించడం ద్వారా వారిలో వచ్చే రక్తహీనత, పోషకాహార లోపాలను సమర్థవంతంగా నివారించవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి” అని సూచించారు. కార్యక్రమంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పిల్లలందరికీ సురక్షితంగా మాత్రలు అందేలా చర్యలు తీసుకున్నారు.

