మచిలీపట్నం డాక్టర్‌కు ఉత్తమ ఫిజియోథెరపిస్ట్ అవార్డు ప్రదానం
మచిలీపట్నం :
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, ప్రాణ వెల్నెస్ క్లినిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్. ప్రభాకర్‌కు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ ఫిజియోథెరపిస్ట్’ అవార్డు లభించింది.
గుంటూరులోని విజ్ఞాన మందిరంలో వైభవంగా జరిగిన ‘అమరావతి హెల్త్ కేర్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ మమతా రాయపాటి, టైమ్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ ప్రణీత్‌లు డాక్టర్ ప్రభాకర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు.
వైద్య రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ గుర్తింపు లభించడంతో మచిలీపట్నానికి చెందిన పలువురు ప్రముఖులు, రోగులు, అభిమానులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

