MachilipatnamLocal News
October 25, 2026
జిల్లా

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం: సీఎండీ పి. పుల్లారెడ్డి

  • October 25, 2026
  • 0 min read
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం: సీఎండీ పి. పుల్లారెడ్డి

మచిలీపట్నం:

తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ సన్నద్ధతపై సీఎండీ పి. పుల్లారెడ్డి కృష్ణా జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ… తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. తుఫాన్ దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులెవరూ సెలవులు తీసుకోకూడదని, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని ప్రజలను కోరారు.

కృష్ణా జిల్లా విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు:

అత్యవసర సమాచారం, ఫిర్యాదుల కోసం అన్ని సర్కిల్, డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ తెలిపారు.
* కృష్ణా సర్కిల్ కార్యాలయం: 6281709355
* మచిలీపట్నం డివిజన్: 9440817572
* ఉయ్యూరు డివిజన్: 7382623231
* గుడివాడ డివిజన్: 9440817573
ఈ సమావేశంలో కృష్ణా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ హరిబాబు మరియు ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN