నూరు శాతం అక్షరాస్యత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రూపొందించిన అక్షరాస్యత కార్యక్రమం ‘ఉల్లాస్’-02 ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమము అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా శాఖా ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ అన్ని జిల్లాల కల్లెక్టర్ల కు సూచించారు. విద్యా శాఖా ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ గత నెల 12 న సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశమునకు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజి హాజరైనారు. ఈ సమావేశంలో విద్యా శాఖా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కోర్సు మొత్తం వ్యవధి: 100 గంటలు అందులో వీడియో పాఠాలు: 15 గంటలు, తరగతి బోధన : 40 గంటలు, వర్క్ట్లు,మోడల్ పేపర్ల అభ్యాసం: 45 గంటలు గా నిర్వహించాలని తెలిపారు. మహిళలకు క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత , డిజిటల్ అక్షరాస్యత సాధించడంపై దృష్టి సారించి ఈ కార్యక్రమం వినూత్నంగా అమలు చేయబడుతోందన్నారు. 2025-26 లో కృష్ణాజిల్లాలో మొత్తం 73,237 మంది నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు. జిల్లాలో 25 రూరల్ మండలాల్లో కమిటీలో డిఆర్డిఎ, మెప్మా బాధ్యతలు వివరిస్తూ గుర్తించిన వాలంటీర్లు, అభ్యాసకులను మ్యాచింగ్ బ్యాచింగ్ జరిపి స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా అక్షర ఆంధ్ర యాప్ నందు నమోదు చేయాలి అని తెలిపారు. వయోజన విద్య వాలంటీర్ టీచర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతిరోజూ అక్షర కేంద్రాలను సందర్శించి యాప్ నందు ఫోటోతో పాటు ఆ రోజు జరిగిన బోధన వివరములు సమర్పించవలసిందిగా ఆదేశించారు. అక్షరాస్యతా కార్యక్రమములో భాగముగా భోదన తరగతుల నిర్వహణకు ప్రైమర్లు, అభ్యసన కార్యక్రమములు, వర్క్ షీట్లు అందించారు.. టిసిఎస్ ద్వారా ఫైనాన్షియల్ లిట్రసి, డిజిటల్ లిట్రసి కి సంబందించి 42 వీడియో పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమములో రవికాంత్, జి ఎస్ డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసర్, పి. శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.