మచిలీపట్నం :
సోమవారం మీకోసం స్పందన కార్యక్రమంలో జనతా వారధి ద్వారా ప్రజల తరఫున గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరుతో ప్రతి పేదవాడికి సెంటు భూమి, ఇల్లు అనే పథకంలో జరిగినటువంటి అవకతవకలు , అనధికారిక వసూళ్ల గురించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలి బిజెపి కృష్ణాజిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
జగనన్న ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకొనుటకు అధికారులు సహకరించవలసిందిగా వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి భూమి యొక్క కొత్త పాసు పుస్తకాల వ్యవహారంలో జరుగుతున్న జాప్యము ను, అక్రమ వసూళ్ల గురించి, అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే నోషనల్ ఖాతా నంబర్ బదులుగా శాశ్వత ఖాతా నెంబర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్ బుక్ కూడా ఆర్ ఓ ఆర్ వన్ బి , అడంగల్ తరహాలో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించి పాసు పుస్తకాల ముద్రణకు అయ్యే ఖర్చు తగ్గించి సమయం ఆదా చెయ్యాలని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలో జరుగుతున్న లోపాల గురించి, మొత్తం మూడు వినతులు సమర్పించి తక్షణమే విచారణ చేపట్టి పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కృష్ణాజిల్లా జనతా వారధి కన్వీనర్ సిద్ధార్థ , బిజెపి సీనియర్ నాయకులు పంతం వెంకట గజేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు, ట్రెజరర్ సుబ్బారావునాయుడు , సాలాది రామకృష్ణ , నరేంద్ర , చదలవాడ వీరేంద్ర , తదితరులు పాల్గొన్నారు.