MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్య

  • June 19, 2026
  • 0 min read
మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్య

మచిలీపట్నం:

స్థానిక ఈడేపల్లికి చెందిన షేక్ ఆసిఫ్ (25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు ఆసిఫ్ మచిలీపట్నంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

About Author

SSN