MachilipatnamLocal News
June 19, 2026
మచిలీపట్నం

శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక సీమంతంవేడుక

  • June 17, 2026
  • 1 min read
[addtoany]
శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక సీమంతంవేడుక

గూడూరు:

గూడూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి, మచిలీపట్నం వారు గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమతి బి కళ్యాణి, శ్రీమతి పోతుకుచి నాగమణి జ్యోతి ప్రజ్వలనముతో, ప్రారంభమైన కార్యక్రమము, సర్వ మత శాస్త్రోక్తంగా, స్త్రీల సీమంత కార్యక్రమాన్ని, శ్రీమతి A. వాణి , డాక్టర్ శ్రీ దుర్గ, డాక్టర్ అరుణ కాత్యాయని, శ్రీమతి బి కాళికాదేవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా DCHS డాక్టర్ శేషు కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన శ్రీ సత్యసాయి సేవా సమితి వారు గూడూరు కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు నారాయణ సేవ అన్నదానం నిర్వహించడం ఆనందదాయకమని, వారు ఒక పుట్టింటి వారి లాగా ఈరోజు ఈ సీమంతం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ, సత్య సాయి సేవ సమితి వారు రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనకు కూడా వారి కార్యక్రమాలు అందించటం ఆనందదాయకమని తెలియజేశారు.

స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ కాత్యాయని మాట్లాడుతూ ” ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకము ” నిర్వహించు రోజు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు నిర్వహించు సేవలను కొనియాదారు. సమితి కన్వీనర్ శ్రీ పోతుకుచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి వారు , జాతీయస్థాయిలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యము బిడ్డల సంరక్షణ మొదలగు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంగా ఉంటారని, మానసిక ప్రశాంతత కలిగి ఉండాలని, దానికి ఆధ్యాత్మికత ఎంతైనా అవసరమని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేకతిధిగా విచ్చేసిన మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ మాట్లాడుతూ, సత్యసాయి సేవా సంస్థలు పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, నేను అందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉంటానని,వారు చేసిన విధంగా సేవలు ఏ సంస్థ చేయలేదని తెలియజేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతినెలా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చూస్తున్నామని, సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలను కమిటీ సభ్యులకు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి అనుమకొండ సోమేశ్వరీ దేవి, కొట్టి నాగమణి, శ్రీమతి మద్దుల గౌరి, శ్రీమతి సరస్వతి లతోపాటు, కొల్లిపర సాయిమోహిని, టైలర్ నాగమణి విశాలి తో పాటు, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీమంతం చేసుకున్న దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు సంస్థ వారు విందు ఏర్పాటు చేశారు.

About Author

SSN