MachilipatnamLocal News
June 19, 2026
మచిలీపట్నం

పేదల సంక్షేమ పథకాలపై బీజేపీ ఓబీసీ మోర్చా రిజిస్ట్రేషన్ శిబిరం

  • June 17, 2026
  • 1 min read
[addtoany]
పేదల సంక్షేమ పథకాలపై బీజేపీ ఓబీసీ మోర్చా రిజిస్ట్రేషన్ శిబిరం

మచిలీపట్నం:

భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నమ్మకం.. అభివృద్ధి.. పేదల సంక్షేమానికి 12 సంవత్సరాలు” కార్యక్రమంలో భాగంగా పేదల సంక్షేమ పథకాల రిజిస్ట్రేషన్ శిబిరాన్ని బుధవారం మచిలీపట్నం రైతు బజార్ వద్ద నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మోర్ల మహీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, టీడీపీ పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. పేదలు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం సూర్యఘర్, పీఎం స్వనిధి, లఖ్‌పతి దీదీ, వీబీ-జీ రామ్‌జీ తదితర పథకాలకు ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు లంకపల్లి నాగమల్లేశ్వరరావు, కంకిపాటి సురేష్, ఉపాధ్యక్షులు అంకం రాజు, గుల్లపూడి శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, డొక్కు విష్ణువర్ధనరావు, బండారు సోమేశ్వరరావు, కార్యదర్శి గంట సతీష్, వన్‌రెడ్డి ప్రసన్నకుమార్, సలాది రామకృష్ణ, నల్లగోపుల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN