MachilipatnamLocal News
June 6, 2026
కథాంజలి

మనిషిగా పుట్టడం అదృష్టం…మంచి మనిషిగా గుర్తుండిపోవడం మహా అదృష్టం…

  • June 6, 2026
  • 1 min read
[addtoany]
మనిషిగా పుట్టడం అదృష్టం…మంచి మనిషిగా గుర్తుండిపోవడం మహా అదృష్టం…

ఓ మనిషి

జీవితం అంటే కేవలం
పుట్టడం, పెరగడం, బ్రతకడం కాదు…

మన కోసం మాత్రమే జీవిస్తే
అది ఒక కథ…

ఇతరుల కోసం కూడా జీవిస్తే
అది ఒక చరిత్ర…


మట్టిలో పుట్టిన మనిషి,
మేడల్లో నివసించినా,
చివరికి చేరేది అదే మట్టి…

ని
నిన్నటి గర్వం,
నేటి సంపద,
రేపటి పేరు ప్రతిష్టలు…

కాలం ముందు
ఒక క్షణం అతిథులే…

షి
శిఖరాలను అధిరోహించడం గొప్ప కాదు,
కింద పడిన వారిని
చేతి పట్టి లేపడం గొప్ప…

వంద మందిలో
గుర్తింపు పొందడం విజయం కాదు,
ఒక్కరి కన్నీరు తుడిచి
గుండెల్లో నిలవడం విజయం…

మనిషి సంపాదించిన డబ్బు
అతని వెంట రాదు…

కానీ అతను పంచిన ప్రేమ,
చేసిన సహాయం,
మాట్లాడిన మంచి మాట…

ఎప్పటికీ మిగిలిపోతాయి…

చెట్టు తన ఫలాలను తినదు,
నది తన నీటిని తాగదు,
సూర్యుడు తన వెలుగును తనకోసం ఉంచుకోడు…

ప్రకృతి మొత్తం
ఇతరుల కోసం జీవిస్తోంది…

అయితే మనిషి మాత్రమే
“నాకేంటి?” అని అడుగుతున్నాడు…

ఓ మనిషి
ఒక్కసారి
“నేను ఎవరికీ ఉపయోగపడుతున్నాను?”
అని ప్రశ్నించుకో…

ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానమే
నీ జీవిత విలువ…

ఎందుకంటే…

పుట్టడం మన చేతిలో లేదు…
చనిపోవడం మన చేతిలో లేదు…
కానీ మధ్యలో ఎలా జీవించాలో మాత్రం మన చేతిలో ఉంది…

🌹 మనిషిగా పుట్టడం అదృష్టం…
మంచి మనిషిగా గుర్తుండిపోవడం మహా అదృష్టం… 🌹

రషీదా Begum Shaik
NRI Founder&CEO
RRT NGO
00965 55052029
Rasheedaaab.ra@gmail.com

About Author

SSN