MachilipatnamLocal News
June 6, 2026
పోలీస్ & లీగల్ డైరీ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

  • June 5, 2026
  • 0 min read
[addtoany]
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని చిలకలపూడి సబ్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ పద్మ తెలిపారు. జిల్లా విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం నగరంలోని బైపాస్ రోడ్డు సర్కిల్ వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. తనిఖీల సందర్భంగా ఎస్‌ఐ సిహెచ్ పద్మ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు పలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం, దొంగతనాలు ఇతర నేరాలను అరికట్టడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయగలమని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ చంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN