MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసివేసిన నిర్వాహకులు

  • May 20, 2026
  • 1 min read
[addtoany]
స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసివేసిన నిర్వాహకులు

మచిలీపట్నం:

ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ దేశవ్యాప్త బంద్ లో భాగంగా మచిలీపట్నం మెడికల్ షాప్ నిర్వాహకులు బుధవారం బందును పాటించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపులో భాగంగా నిర్వహించిన ఔషధ దుకాణాల బంద్‌కు పట్టణ వ్యాప్తంగా పూర్తి మద్దతు లభించింది అని మచిలీపట్నం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు అన్నారు.

ఈ బంద్‌లో దాదాపు 200 మందుల షాపులను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు అని అత్యవసర సమయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు కేవలం నగర వ్యాప్తంగా నాలుగు షాపులను మాత్రం తెరిచి ఉంచడం జరిగింది అని అన్నారు ​ కరోనా సమయం నుండి ఆన్‌లైన్ మందుల వ్యాపారానికి అనుమతులు ఇవ్వడం వల్ల, ప్రస్తుతం మార్కెట్‌లో మందుల సరఫరాపై పూర్తి నియంత్రణ లోపించింది అని దీనివల్ల నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా మత్తు కలిగించే మందులు సులభంగా లభ్యమవుతుండటంతో, అవి యువత చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆన్‌లైన్ మందుల అమ్మకాలకు సంబంధించిన జీవోను తక్షణమే రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేసారు. కార్పొరేట్ ఫార్మసీలు, కొన్ని ఆన్‌లైన్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ వ్యాపారం చేస్తుండటం వల్ల, చిన్న తరహా మందుల షాపులు మరియు స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ​చిన్న వ్యాపారుల జీవనోపాధిని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆల్ ఇండియా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహించామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నారాయణ భట్టు, మచిలీపట్నం అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి సురేష్, మాదిరెడ్డి అంజిబాబు, కొసధికారి తోట వాసు, సభ్యులు వెంకట రమణ, వాసుదేవ ప్రసాద్, రాము, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు

About Author

SSN