MachilipatnamLocal News
July 20, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షా ఫలితాలు విడుదల

  • May 8, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షా ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలతో పాటు, బి. ఫార్మసీ మొదటి మరియు ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షలు, యూజీ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను శుక్రవారం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్ జీ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి. వీర బ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆయన సూచించారు.

పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ బి. ఫార్మసీ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా 20-05-2026 నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి. వీర బ్రహ్మచారి తెలిపారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *