కృష్ణా జిల్లా మచిలీపట్నం కు చెందిన యువ క్రికెటర్ రవడ ధనదీప్ అండర్ -12 కృష్ణా జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. పట్టణంలోని ఎస్సార్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న ధనదీప్ తండ్రి రామకృష్ణ బెల్ ఉద్యోగి, తల్లి లక్ష్మి గృహిణి.
ఇటీవల మంగళగిరి క్రికెట్ స్టేడియంలో అండర్- 12 విభాగంలో కృష్ణా జిల్లా జట్టు ఎంపిక కోసం మ్యాచులు నిర్వహించారు.ఈ మ్యాచుల్లో రవడ ధనదీప్ అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అన్ని మ్యాచుల్లోను ఎక్కువగా స్కోర్లు చేస్తూ నిలకడగా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రధానంగా సాంకేతిక పరంగా చక్కటి ఆటను ఆడటంతో అందరి నుండి ప్రశంసలు పొందాడు. దాని ఫలితమే కృష్ణా జిల్లా అండర్ – 12 క్రికెట్ విభాగంలో స్థానం పొందటం విశేషం.
కృష్ణా జిల్లా అండర్ 12 క్రికెట్ టీమ్ కు ధన దీప్ ఎంపిక కావటం పట్ల తల్లి తండ్రులతో పాటు,బందరు క్రికెట్ అభిమానులు,స్నేహితులు,శ్రేయోభి లాషులు హర్షం వ్యక్తం చేశారు.