MachilipatnamLocal News
March 30, 2026
పోలీస్ & లీగల్ డైరీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ

  • January 19, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ
మచిలీపట్నం :
 
      ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీ కోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. 
 
       స్వీకరించిన ఫిర్యాదులను తక్షణ చర్యల కోసం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చూపించాల్సిందిగా కోరారు.
 
 మీకోసం ఫిర్యాదుల వివరాలు:
 
       పెనమలూరు నుండి నవీన్ అనే వ్యక్తి వచ్చి తనతో కలిసి పని చేసే వ్యక్తితో తన తమ్ముడికి ఉద్యోగం గూర్చి అడగగా, కొంత మొత్తం కడితే ఉద్యోగం వస్తుందని నమ్మ పలికి తన వద్ద నుండి 3 లక్షల రూపాయలు తీసుకున్నారని సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు. 
 
       వడ్లమన్నాడు నుండి కవిత అనే వివాహిత  తనకి వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందని వివాహం జరిగిన నాటినుండి తన భర్త అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు. 
 
          మచిలీపట్నం నుండి సాల్మన్ అనే వ్యక్తి  తన నివాస గృహానికి ఉన్న సరిహద్దుదారుడు తన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని, గోడ కట్టినప్పటికీ అక్రమంగా గోడను కూల్చివేసి తమపై భౌతికదాడికి పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *