జిల్లా ఎస్పీ వివవిద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బందరు డిఎస్పి సిహెచ్ రాజా పర్యవేక్షణ లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ( శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమం) సందర్భంగా జాతీయ రహదారి 216 పై వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేశారు.
బందరు ట్రాఫిక్ పోలీసులు, జిల్లా రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ హెచ్ 216 జాతీయ రహదారిపై వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్దిని విద్యార్ధులతో కలిసి మార్చ్ ఫాస్ట్ ద్వారా ప్రయాణీకులకు వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ద్వి వాహన దారులను ఆపి హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పించారు. అలాగే మోటారు కారు చోదకులకు సీటు బెల్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి డి టి ఓ శ్రీనివాసు ఎం వి ఐ లు నారాయణస్వామి, సోని, ట్రాఫిక్ సిఐ నున్న రాజు, సిబ్బంది పాల్గొన్నారు.