MachilipatnamLocal News
January 14, 2026
స్పెషల్ స్టోరీ

పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించవచ్చా???? చట్టం ఏం చెబుతుంది….

  • January 5, 2026
  • 1 min read
[addtoany]
పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించవచ్చా???? చట్టం ఏం చెబుతుంది….
మచిలీపట్నం:
 
      ఆదివారం రాబర్ట్ సన్ పేట్ పోలీసులు ఒక కేసులో నిందుతులను బహిరంగంగా నడిపించి స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. ఈ సంఘటనపై సీఐ ఏసుబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు మచిలీపట్నం లో మద్యం సేవించిన వారి ఆగడాలు సాగకూడదని, అలాంటి వారికి హెచ్చరికగా నిందుతులను రోడ్డుపై ఉరేగిస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎవరైనా పునరావృతం చేస్తే వారిని కూడా ఇలాగే ఉరేగిస్తామని హెచ్చరించారు. 
 
      సాధారణంగా ఏదేని కేసులో నిందుతులను మీడియా ముందు ప్రవేశ పెట్టేడప్పుడు, పోలీసులు నిందుతుల ముఖానికి ముసుగు వేస్తారు. కానీ కృష్ణా జిల్లా పోలీసులు మాత్రం రోడ్డుపై ఊరేగించి మీడియాకి, ప్రజలకు ప్రదర్శన చేశారు.
 
         కానీ, పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించడంపై మన దేశంలో చట్టపరమైన నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.
 
          భారత రాజ్యాంగం ప్రకారం, ప్రతి వ్యక్తికీ (నిందితుడితో సహా) గౌరవంగా జీవించే హక్కు ఆర్టికల్ 21 కల్పిస్తుంది. నిందితుడిని బహిరంగంగా రోడ్డుపై నడిపించడం వల్ల వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని న్యాయస్థానాలు గతంలో పేర్కొన్నాయి.
 
           సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల తీర్పులు నిందితుడి గౌరవం కాపాడమంటున్నాయి. నిందితుడిని నేరస్తుడిగా కోర్టు నిర్ధారించే వరకు అతను నిర్దోషిగానే పరిగణించబడతాడు. కాబట్టి, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు వారిని అవమానపరిచేలా ప్రవర్తించకూడదు.
 
          అత్యవసరం అయితే తప్ప  నిందితుడు పారిపోయే అవకాశం ఉన్నా లేదా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నప్పుడు తప్ప, సాధారణ పరిస్థితుల్లో వారిని రోడ్డుపై నడిపించడం లేదా ప్రదర్శించడం చేయకూడదు.
 
        పోలీసులు కొన్ని సందర్భాల్లో నిందితులను బహిరంగంగా తీసుకెళ్తుంటారు. అవి నేరం జరిగిన చోటుకి నిందితుడిని తీసుకెళ్లి వివరాలు సేకరించాల్సి వచ్చినప్పుడు,  నిందితుడు దాచిన ఆయుధాలను లేదా వస్తువులను వెలికితీసే క్రమంలో లేదా వాహనం వెళ్లలేని ఇరుకైన ప్రదేశాల్లో నడిపించాల్సి రావచ్చు.
 
     నిందితులను ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి లేదా సమాజంలో వారిని తక్కువ చేసి చూపడానికి పోలీసులు రోడ్డుపై నడిపించడం తప్పు అని చట్టం చెబుతుంది. దీనిపై బాధితులు లేదా వారి తరపు న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్ (NHRC) కు లేదా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
 
      లేదా నిందితుడిని కోర్టులో హాజరు పరిచినప్పుడు, పోలీసులు తనను బహిరంగంగా నడిపించి అవమానించారని నేరుగా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మెజిస్ట్రేట్ దీనిపై విచారణకు ఆదేశించవచ్చు.
 
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *