కేడీసీసీ బ్యాంక్ మచిలీపట్నం ప్రధాన కార్యాలయం లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కే డి సి సి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం. గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం ఆహ్వానం కోరుతూ ముందుగా కేక్ కట్ చేసి ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేడిసిసి బ్యాంక్ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలలు మిగిలి ఉందని, ఈ మూడు నెలల్లో బ్యాంకు రుణాలు వసూళ్లలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలి అన్నారు.
అలాగే రైతులకు లోన్లు ఇచ్చే విషయం లో కూడా కెడీసీసీ బ్యాంక్ ప్రథమ స్థానంలో ఉండాలని ఉద్యోగులను కోరారు. రానున్న కాలంలో మరింత ప్రగతిని సమిష్టిగా సాధిద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో ఎం శ్యాం మనోహర్, డి.ఎం లు, డిజిఎంలు, మేనేజర్ లు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.