MachilipatnamLocal News
October 25, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ఎన్నికల నేపథ్యం: మచిలీపట్నం పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ

  • October 24, 2026
  • 0 min read
ఎన్నికల నేపథ్యం: మచిలీపట్నం పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ

మచిలీపట్నం:

రాబోయే స్థానిక సంస్థల మరియు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్నం రెవెన్యూ విభాగ పరిధిలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డిఎస్పీ) ఎ. శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బంటుమిల్లి మండల పరిధిలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అర్తమూరు, పెద తుమ్మిడి, బంటుమిల్లి, చిన పాండ్రాక గ్రామాలు; పెడన మండలంలోని కొంకేపూడి, పెడన పట్టణంలోని కొన్ని వార్డులు, అలాగే గూడూరు మండలంలోని ఆకుమర్రు లాకు గ్రామం మరియు ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన నేరుగా సందర్శించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలతో పాటు లైటింగ్, జనరేటర్, కెమెరాల ఏర్పాటు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో డిఎస్పీ వెంట పెడన ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్, బంటుమిల్లి సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పెడన సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN