MachilipatnamLocal News
October 17, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయం పరీక్షల ఫలితాలు విడుదల

  • October 17, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయం పరీక్షల ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పలు కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ, రీ-వాల్యుయేషన్ మరియు యూజీ వన్‌టైమ్ ఆపర్చునిటీ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ ప్రొఫెసర్ కోన రాంజీ ఆదేశాల మేరకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. ఉష మరియు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి. వీర బ్రహ్మాచారి ఫలితాలను వెల్లడించారు.

విడుదలైన ఫలితాల వివరాలు:

* ఎల్‌ఎల్‌.బి. (LL.B.): II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) ఫలితాలు.
* బి.ఎ. ఎల్‌ఎల్‌.బి. (B.A. LL.B.): II & VI సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) ఫలితాలు.
* పీజీ (PG) & ప్రొఫెషనల్ కోర్సులు: PG (MA/M.Com/M.Sc/MHR/M.Ed/MPA) & MBA/MCA – II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) ఫలితాలు.
* ఎల్‌ఎల్‌.ఎం. (LL.M.): II సెమిస్టర్ రీ-వాల్యుయేషన్ ఫలితాలు.
* యూజీ (UG): 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ (2015-2020) వన్‌టైమ్ ఆపర్చునిటీ ఫలితాలు.

పునఃమూల్యాంకనం  వివరాలు:

ఎల్‌ఎల్‌.బి. – II, బి.ఎ. ఎల్‌ఎల్‌.బి. – II/VI, మరియు PG & MBA/MCA-II సెమిస్టర్ ఫలితాలకు సంబంధించి రీ-వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 29, 2026 లోపు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ www.kru.ac.in ద్వారా చూడవచ్చని అధికారులు తెలిపారు.

About Author

SSN