MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాల పంపిణీ

  • October 15, 2026
  • 1 min read
ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాల పంపిణీ

మచిలీపట్నం :

మచిలీపట్నంలోని ‘ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ’ కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు మరియు ప్రశంసా పత్రాల బహుకరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సొసైటీ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందించి సత్కరించింది.

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఏ. కోటేశ్వరరావు మాట్లాడుతూ… విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినప్పుడు వారిని ప్రోత్సహించడం సొసైటీ బాధ్యతగా భావిస్తోందన్నారు. సొసైటీ పరిధిలోని 46 బ్రాంచ్‌లలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రోత్సాహకం నిమిత్తం మొత్తం ₹2,56,10,000/- (రెండు కోట్ల 56 లక్షల 10 వేల రూపాయలు) విలువైన చెక్కులను, నగదు పురస్కారాలను అందించినట్లు తెలిపారు. అందులో భాగంగా మచిలీపట్నం బ్రాంచ్ పరిధిలో ఎంపిక చేసిన 14 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలను అందజేశామని వివరించారు.

విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తమ తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు తేవా అని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్, సొసైటీ సిబ్బంది పి. శ్రీకాంత్ తో పాటు పలువురు బ్యాంకింగ్ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author

SSN