మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ కి బిసి సంక్షేమ సంఘం అభినందనలు
మచిలీపట్నం:
మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) నూతన సూపరింటెండెంట్గా నియమితులైన డాక్టర్ పద్మశ్రీ ని బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంఘ నాయకులు ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో డాక్టర్ పద్మశ్రీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సర్వజన ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, హాస్పిటల్లో నెలకొన్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇందుకు నూతన సూపరింటెండెంట్ సానుకూలంగా స్పందిస్తూ, రోగులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘ నాయకులు బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, భోగిరెడ్డి సుభాని, నీలపాల కృష్ణ, పెదిబోయిన సాంబ, బొమ్మనబోయిన నాగరాజు, నాంచారయ్య, M. గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

