MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

వెనుకబడిన తరగతుల చిరు వ్యాపారులకు ఆర్థిక రుణాలు మంజూరు చేయాలి: శేకుబోయిన సుబ్రమణ్యం

  • October 8, 2026
  • 0 min read
వెనుకబడిన తరగతుల చిరు వ్యాపారులకు ఆర్థిక రుణాలు మంజూరు చేయాలి: శేకుబోయిన సుబ్రమణ్యం

మచిలీపట్నం:

వెనుకబడిన తరగతులు (బిసి), కాపు మరియు ఇడబ్ల్యూఎస్ కోటా కింద చిన్నతరహా వ్యాపారాలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న పేదలకు తక్షణమే ఆర్థిక రుణాలు మంజూరు చేయాలని బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు బిసి కార్పొరేషన్ ఈడికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ, సుమారు సంవత్సరన్నర క్రితం ప్రభుత్వం ప్రకటించిన పథకాల ఆధారంగా రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు సబ్సిడీ రుణాల కోసం వేలాదిమంది పేదలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బిసి, కాపు, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, రాజులు తదితర వర్గాలకు చెందిన సుమారు 2,000 మందికి పైగా పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చిరు వ్యాపారులు, షాపులు నడుపుకునే వారు ఉపాధి పొందేందుకు ఈ రుణాలు ఎంతగానో తోడ్పడతాయని, అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాలను విడుదల చేయాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన ఈడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, కోమటి శ్రీను, పెద్ది సాంబ శివ, భోగి రెడ్డి సుభాని, గౌర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN