గురువారం కృష్ణా జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రకియ
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో 21 మద్యం షాపుల కేటాయింపు కోసం గురువారం (08-10-2026) రోజున లాటరీ (డ్రా) తీయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి తెలిపారు. మొత్తం 35 మద్యం షాపులకు గాను, కనీసం 4 అప్లికేషన్లు వచ్చిన 21 షాపులకు ఈ డ్రా నిర్వహిస్తారు.
ముఖ్య వివరాలు:
* వేదిక: మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్.
* సమయం: ఉదయం 08:00 గంటలకు.
* రుసుము వివరాలు: డ్రాలో గెలుపొందిన అభ్యర్థులు అదే రోజున షాపు రుసుములో 1/4వ వంతు వార్షిక లైసెన్స్ ఫీజు మరియు 1/3వ వంతు పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించిన వారికి ప్రొవిజనల్ లైసెన్స్ మంజూరు చేస్తారు. ఒకవేళ ఫీజు కట్టకపోతే రిజర్వ్ అభ్యర్థికి షాప్ కేటాయిస్తారు.
అప్లికేషన్ వేసిన అభ్యర్థులు తమతో పాటు అక్నాలెడ్జ్మెంట్ మరియు సంబంధిత కాపీలతో ఉదయం 8:00 గంటలకల్లా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లలోని ఇన్స్పెక్టర్లను లేదా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం (మచిలీపట్నం), ఫోన్ నంబర్: 8466981837 ను సంప్రదించవచ్చు.

