MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

  • October 7, 2026
  • 1 min read
కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

మచిలీపట్నం:

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో “అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ… వయోవృద్ధులు అధైర్యపడవద్దని, వారి రక్షణకు చట్టాలు ఉన్నాయని మరియు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వయోవృద్ధుల అనుభవాలు సమాజానికి, భావితరాలకు ఎంతో మార్గదర్శకమని పేర్కొన్నారు. మండల స్థాయిలో మిగిలిఉన్న వయోవృద్ధుల కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా 80 నుండి 100 సంవత్సరాల వయస్సు గల పలువురు వయోవృద్ధులను, వృద్ధాశ్రమ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చండిక గంగాచలరావు, మోతుకూరి వెంకటేశ్వరరావు, ట్రిబ్యునల్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ మరియు సుమారు 100 మంది వయోవృద్ధులు పాల్గొన్నారు.

About Author

SSN