కడప జిల్లా పద్మశాలీయుల కార్తీక వనభోజన మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ
కడప:
కడప జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మానసాదేవి దేవస్థానం వద్ద నిర్వహించనున్న “కార్తీక మాస వనభోజన మహోత్సవం” కరపత్రాలను బుధవారం బద్వేలులో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాసా కోదండ రామ్, కడప జిల్లా ఉపాధ్యక్షుడు సోమల సంజీవ, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుత్తా శ్రీనివాసులు పాల్గొని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఈ వనభోజన మహోత్సవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలీయులందరూ కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు చుప్పల ప్రహ్లాద, జొన్నాదుల చిన్న సుబ్బారాయుడు, మలాయతుల చెండ్రాయుడు, జొన్నాదుల వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

