కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విసి ప్రొఫెసర్ కె. రాంజీ సమీక్షా సమావేశం
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె. రాంజీ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కార్యదర్శులు మరియు కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. రాంజీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన ప్లేస్మెంట్స్, క్రమబద్ధమైన అకాడమిక్ క్యాలెండర్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
విసి వెల్లడించిన ముఖ్యాంశాలు:
* ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్: రాష్ట్రంలో ఫలితాల ప్రకటనలో వ్యత్యాసాలు లేకుండా డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుందని తెలిపారు. కృష్ణా వర్సిటీ పరిధిలో పరీక్షలు పూర్తయిన 20 నుండి 30 రోజుల్లోనే ఫలితాలు వేగంగా విడుదల చేస్తున్నామని గుర్తుచేశారు.
* 75% హాజరు తప్పనిసరి: పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75% హాజరు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య కారణాలు/క్రీడలకు 65% వరకు మినహాయింపు ఉంటుందని, 65% కంటే తక్కువ ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్ టికెట్లు జారీ చేయవద్దని ఆదేశించారు.
* డేటా సీరియస్నెస్: FRS, ఫీజు రీయింబర్స్మెంట్ పోర్టల్ మరియు ప్రభుత్వ డాష్బోర్డ్లలో ప్రతీ విద్యార్థి హాజరు మరియు వివరాలు సమయానికి, పక్కాగా నమోదు చేయాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పారు.
* స్కిల్స్ & ప్లేస్మెంట్ డ్రైవ్లు: విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల విద్యార్థుల కోసం మోడల్ సెంటర్లను ఏర్పాటు చేసి శనివారాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
* అడ్మిషన్లు & ఎంఓయూలు: నాణ్యమైన విద్య అందించడం ద్వారానె అడ్మిషన్లు పెరుగుతాయని, విద్యార్థులకు నేరుగా శిక్షణ ఇచ్చేందుకు పలు కంపెనీలతో ఎంఓయూలు (MoU) కుదుర్చుకున్నామని తెలిపారు.
విద్యార్థులను క్రమశిక్షణతో చదివిస్తూ, మారుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా వారిని సిద్ధం చేయడమే లక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

