MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

డిసెంబర్ 29న భగవద్గీత కంఠస్థ పోటీలు

  • September 29, 2026
  • 1 min read

మచిలీపట్నం:

గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 29న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అసిస్టెంట్ సి.వి.కె. ప్రసాద్, శ్రీవారి సేవకురాలు కోరే చిట్టి కుమారి తెలిపారు. ఈ పోటీలను మూడు విభాగాలలో నిర్వహించనున్నారు.

పోటీ విభాగాల వివరాలు:

* మొదటి విభాగం (6వ నుండి 9వ తరగతి): భగవద్గీతలోని 6వ అధ్యాయం ‘ఆత్మ సంయమ యోగము (ధ్యానయోగం)’ లోని శ్లోకాలు.
* రెండవ విభాగం (10వ తరగతి & ఇంటర్మీడియట్): 18వ అధ్యాయం ‘మోక్ష సన్యాస యోగము’లోని శ్లోకాలు.
* మూడవ విభాగం (18 నుండి 45 ఏళ్ల వయస్సు గలవారు): “నిత్య జీవితంలో భగవద్గీత” అనే అంశంపై భావ విశ్లేషణ.

పోటీలు నిర్వహించే వేదికను గీతా జయంతికి 10 రోజుల ముందు వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి విభాగంలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కొల్లు నీరజ చేతుల మీదుగా బహుమతులు, మెమెంటోలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. కావున విద్యార్థులు ముందస్తుగా సిద్ధమవ్వాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలను ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆసక్తి కలవారు కోరే చిట్టి కుమారి 8247086386 నెంబర్ నందు సంప్రదించగలరు.

About Author

SSN