MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా జిల్లా

2026లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి

  • January 1, 2026
  • 0 min read
2026లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి
జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు
 
మచిలీపట్నం :
 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, 2026లో ఆయన నాయకత్వంలో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులకు ఉపయోగపడే చిన్న సైజు బల్లలను పెద్ద మొత్తంలో అందించారు.జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు, కె.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ హౌసింగ్ పీడీ పోతురాజు, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డిఆర్డిఏ, మెప్మా, ఐసిడిఎస్ పిడిలు హరిహరనాథ్, సాయిబాబు, ఎం.ఎన్ రాణి, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, కలెక్టరేట్ ఏవో రాధిక, డిపిఓ జే అరుణ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు జె జ్యోతి, నాగరాజా, చిన్న నరసింహులు, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖల అధికారులు షేక్ షాహిద్ బాబు, ఫణి ధూర్జటి, జి రమేష్, కామరాజు, డిఇఓ యు వి సుబ్బారావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డీఎస్ఓ జీ మోహన్ రావు, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ రామ్ లక్ష్మణరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్ ప్రసాద్, మచిలీపట్నం, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, నజీర్, పలువురు తహసీల్దారులు తదితర అధికారులు జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
గురువారం జడ్జి  బంగ్లా నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *