మచిలీపట్నం :
పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసులో కృష్ణా జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు, మరింత దర్యాప్తు కొనసాగించి మరో ముగ్గురు మహిళ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెర నుండి మరో బాలుడిని సురక్షితంగా రక్షించడమే కాకుండా, రూ.80,500 నగదును కూడా సీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అభం శుభం తెలియని పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలని ప్రయత్నించిన ఒక ముఠా, తల్లుల వద్ద నుంచి పిల్లలను వేరుచేసి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు గ్రహించారు. ఏప్రిల్ 17న పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులో భాగంగా 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన భార్యాభర్తల ఇద్దరిని తో పాటుగా ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురు మహిళలను పట్టుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు నిందితుల వివరాలు గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ గా చెందిన వారని తెలిపారు. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా, బిక్షాటన చేసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లల తల్లిదండ్రులకు మాయమాటలతో దారి తప్పించి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్నారు. అనంతరం పిల్లలు లేని దంపతులకు విక్రయించి అత్యాశతో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడినట్లు తెలిపారు.
కర్ణాటక కు చెందిన దంపతులకు, విజయవాడ లోని ఓ బాలుడని ఈ ముఠా విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది అన్నారు. కర్ణాటక దంపతులకు విక్రయించిన బాలుడిని పోలీసుల సంరక్షణలో ఉంచారు. బాలుడి తల్లిదండ్రుల పూర్తి వివరాలు తెలియకపోవడంతో పోలీసుల సంరక్షణలో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరికైనా బాలుడు వివరాలు తెలిసిన యెడల ఫోన్ నెంబర్లను 9490619468, 8985131931 ను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన పోలీసులకు రివార్డులను ప్రకటించారు.