MachilipatnamLocal News
April 30, 2026
కథాంజలి

చేనేతను ఆదుకోవాలి

  • April 23, 2026
  • 0 min read
[addtoany]
చేనేతను ఆదుకోవాలి
నరాలను పోగులుగా తీర్చిదిద్ది 
రంగురంగుల దారాలతో చీరలు నేసే 
నేతన్నలు…
 
చేతుల నైపుణ్యంతో 
అబ్బురపరిచే విధంగా 
చీరలు నేసే పద్మశాలీలు…
 
మహిళలు తాము నేసిన చీరలను 
కట్టుకోలేని నిర్భాగ్యురాళ్ళు 
కటిక పేదరికంలో 
పూట గడవని నేతన్నలను 
ఆదుకునే వారే కరువయ్యారు! 
 
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 
నేతన్నలను గురించి గొప్పగా 
చెప్పడమే గానీ… ఆదుకుని 
వారిని ఆనందపరచేవారు 
లేక పోయారు! 
 
మహాకవి కబీర్ దాస్
లాంటి మహానుభావుల స్ఫూర్తితో 
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 
ఎదిరించిన నేతన్నలు ఎందరో…
 
చేనేత మగ్గం పై ప్రపంచం 
మెచ్చే విధంగా చీరలు తయారు 
చేయడం ఒక్క నేతన్నకే సాధ్యం! 
కంచి, పోచంపల్లి, గద్వాల్, 
వెంకటగిరి…. ఇలా ఎన్నో 
కళాకృతులను…
కంటి వెలుగు పోతున్న 
వెన్నుపూసలు అరిగిపోతున్న 
తన ధ్యేయం, ధ్యాసతో కడవరకు 
నేత వృత్తినే నమ్ముకున్న నిరుపేదలు 
నేతన్నలు! 
 
రంగుల దారాలతో 
నేతన్నలు నేస్తున్న వస్త్రాలతో 
మన దేశ సంస్కృతిని 
సంస్కారాన్ని, గౌరవాన్ని 
ఇనుమడింప చేస్తున్నారు…
నేతన్నలు! 
 
ప్రతి చేనేత ఇంటిలో 
ఆనందం వెన్నెల్లా
విరియాలి…!
 
పూనం కౌర్,
సినీనటి
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *