కృష్ణా యూనివర్సిటీలో ఇంజనీరింగ్,ఫార్మసీ, పిజి విద్యార్థులకు బుధవారం నాడు ప్రాంగణ ఎంపికల కార్యక్రమాన్ని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే రాంజీ లాంఛనంగా ప్రారంభించారు.
ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్ శివకుమార్ ఆధ్వర్యంలో 15 బహుళ జాతి జాతీయ సంస్థలు, హెచ్ సి గ్రూపు నుండి కొన్ని కంపెనీలు కలిసి సంయుక్తంగా ఈ ప్రాంగణ ఎంపికల కార్యక్రమాన్ని చేపట్టి ఏడాదికి దాదాపు 3 లక్షల ప్యాకేజితో మొత్తం 122 మంది విద్యార్థులను ఎంపిక చేసుకోవడం జరిగిందని వర్సిటీ ప్రాంగణ ఎంపికల డైరెక్టర్ ఆచార్య వై కె సుందర కృష్ణ తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, వివిధ కంపెనీల నుండి వచ్చిన ప్రతినిధులతో ప్రాంగణ ఎంపికలు సమన్వయకర్త కిషోర్ పాటు వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రాంగణ ఎంపికల ఇన్చార్జులు పాల్గొనడం జరిగింది.