MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం

  • February 25, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం
మచిలీపట్నం :
 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కు సంబంధించిన కీలక పనితీరు సూచికల వివరాలను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో కీలక పనితీరు సూచికల( కే.పి.ఐ) పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారికి సంబంధించిన కీలక పనితీరు సూచికలు సిద్ధం చేసి వెంటనే అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఒక గూగుల్ స్ప్రెడ్ షీట్ తయారు చేశామని, అందులో వారి వివరాలను పొందుపరచాలన్నారు. ఇదే చివరిసారిగా నివేదిక అడుగుతున్నామని ఇకపై ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నర్సింహులు, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, సి పి ఓ ఉమాదేవి, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, డి ఈ ఓ సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఉద్యాన అధికారి జే జ్యోతి, జిజిహెచ్ పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *