మచిలీపట్నం:

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి ప్రభుత్వం విషం కక్కుతోంది. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల తీరు మారకపోవడం సిగ్గుచేటు అంటూ కొనకళ్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేత పేర్ని నాని ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని అమ్మేస్తున్నారని, ప్రైవేటుపరం చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలను కొనకళ్ల తీవ్రంగా ఖండించారు. మీడియా ముందు అసత్య ప్రచారం చేయడం వైసీపీకి అలవాటైపోయింది. రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసింది మీరే” అంటూ విమర్శించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఉండకూడదనే ఉద్దేశంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని కూటమి నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, బచ్చుల బోస్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు స్వామి, బత్తిన దాస్, కోస్తా మురళీకృష్ణ, గడ్డం రాజు, తదితరులు పాల్గొన్నారు