MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా యూనివర్సిటీ

వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి- కెయూ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ

  • February 24, 2026
  • 0 min read
[addtoany]
వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి- కెయూ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ
– లీడర్షిప్ ఎక్స్లెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్
 
మచిలీపట్నం : 
 
       విద్యార్ధులు, యువత వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ పిలుపునిచ్చారు. మంగళవారం సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఏర్పాటుచేసిన లీడర్షిప్ ఎక్స్లెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 789 ఫార్ములాను పాటించాలని, ఏడు గంటల నిద్ర, ఎనిమిది గంటల చదువు, తొమ్మిది గంటల ఇతర వ్యాపకాలు కోసం కేటాయించాలని సూచించారు.
        రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ గొప్పదనాన్ని విదేశాల్లో చాటిన వివేకానందుని స్పూర్తి తో ముందుకు సాగాలన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి, మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఆంజనేయ కుమార్, సౌభాగ్యలక్ష్మి, సాయికృష్ణ చైతన్య తదితరులు ప్రసంగించారు. 
 
అనంతరం లీడర్షిప్ ఎక్స్లెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ పై జిల్లా సత్యసాయి సేవా సంస్థ ల అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ తనదైన శైలిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్ధిని విద్యార్ధులు ఆసక్తిగా పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *