MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

వెంకటేశ్వర స్వామి కి అపకీర్తి మూట కట్టింది కూటమి ప్రభుత్వం…. మాజీ మంత్రి పేర్ని నాని

  • February 20, 2026
  • 0 min read
[addtoany]
వెంకటేశ్వర స్వామి కి అపకీర్తి మూట కట్టింది కూటమి ప్రభుత్వం…. మాజీ మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం :
 
           శాసనమండలి సమావేశంలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వైఎస్ఆర్సిపి నాయకులు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను చెప్పులు బూట్లు వేసుకుని తాకి అపవిత్రం చేశారంటూ ఆర్థిక మంత్రి కేశవ్ చేసిన ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని. 
 
          ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ లడ్డు కల్తీ వ్యవహారం పై అసత్యాలను ప్రచారం చేస్తూ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కి అపకీర్తి మూట కట్టింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కల్తీ నెయ్యి పేరిట వేదనకు గురిచేసిన పాపం కూటమి ప్రభుత్వాన్ని వదిలి పెట్టదు, తప్పక మూల్యం చెల్లించుకోవాలన్నారు. హెరిటేజ్ కంపెనీకి వాటాదారులుగా ఉన్న వ్యక్తులకు, కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కల్తీ నెయ్యిలో ని ముద్దాయిలకు ఉన్న సంబంధాలపై సిబిఐ ఎంక్వయిరీ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా ? అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలోని వ్యక్తులు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో హెరిటేజ్ సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వారే అని ఎద్దేవా చేశారు.
 
          వ్యాపార కార్యకలాపాలకు భోలే బాబాకు లింకు కలపొద్దు అంటూ కోర్టు నుంచి అడ్రస్ తెచ్చుకున్న హెరిటేజ్ సంస్థ బోలె బాబాకు హెరిటేజ్ సంస్థకు ఉన్న సంబంధాలను వెల్లడించాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *