ప్రజల కోసం ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం
SSN
- February 22, 2026
- 1 min read
[addtoany]
– దశాబ్దాల కలకు నేడు జీవం పోయడం సంతోషంగా ఉంది
– ప్రతి కార్యకర్తా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
– సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాకారం
– తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నూతన పార్టీ కార్యాలయ శంకుస్థాపన వేడుకలో మంత్ర కొల్లు రవీంద్ర.
–
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాకు సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం ఎన్నో సంవత్సరాల కల. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేదు. కానీ నేడు కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని వలందపాలెం పాత ఆర్టీవో కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలందరి సమక్షంలో భూమిపూజ చేశారు.
ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ ప్రోద్బలంతో నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయాలి.. ప్రజల కోసం పని చేయాలనే ఏకైక లక్ష్యంతో నిత్యం పని చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే.
మనం అధికారం ఉన్నా, అధికారంలో లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యలని తెలుసుకోవడం, ప్రజా వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం చేయడం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆనవాయితీగా మారింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటుగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతుల్ని మార్చడానికి, పేద, బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేయడానికి, ఈ జిల్లా అభివృద్ధికి గాని కార్యాలయంలోనే రేపు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం.
పార్టీ కార్యాలయానిక వచ్చే ప్రతి ఒక్కరికీ పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలు సమావేశాలు నిర్వహంచుకోవడానికి కూడా వీలుగా ఉండేలా విశాలంగా నిర్మాణం చేపడుతున్నాం. ఇదేదో ఆర్భాటాల కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాకు ఉందని మేమేదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యాలయం కేంద్రంగా నిలవబోతుంది. గత ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లే అవకాశం లేదు. సచివాలయాలకి వెళితే వాళ్ళని బెదిరించడం, ఫోటోలు తీయడం, భయపెట్టడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఇవాళ జిల్లా కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు చైర్మన్‌గా జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అడుగులు వేస్తున్నాం. కార్యాలయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

