MachilipatnamLocal News
March 30, 2026
కృష్ణా జిల్లా

పోర్టుకు కనెక్టివిటీ రహదారులను మంజూరు చేసిన కేంద్రమంత్రి

  • February 6, 2026
  • 1 min read
[addtoany]
పోర్టుకు కనెక్టివిటీ రహదారులను మంజూరు చేసిన కేంద్రమంత్రి
కృతజ్ఞతలు తెలిపిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి 
 
మచిలీపట్నం :
 
త్వరలో పూర్తి కాబోతున్న మచిలీపట్నం పోర్ట్ కు కనెక్టివిటీ పెంచడం కోసం తలపెట్టిన అనుసంధాన రహదారులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మంజూరు చేశారు అని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఎన్ హెచ్-216 లోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ ద్వారా ఎన్ హెచ్-65, ఎన్ హెచ్-216 జంక్షన్‌ను మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే 6 లేన్ల బాహ్య పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణం కోసం 573.77 కోట్ల కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అన్నారు. ఈ విషయమై అనేకసార్లు సార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకువచ్చారు. పలుమార్లు లేఖలు వ్రాయడం మీకు విదితమే. అందుకు అనుగుణంగా అయన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరం, ఇటువంటి రహదారులు మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి చెందటానికి ఎంతగానో దోహదం చేస్తాయి అన్నారు. పోర్ట్ అనుసంధాన రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కి మచిలీపట్టణం ప్రజలతరఫున ఎంపీ బాలశౌరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
 
ప్రతిపాదిత పోర్ట్ అనుసంధాన రహదారులు మచిలీపట్నం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాకుండా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ప్రధాన నగరాలతో నిరంతర అనుసంధానాన్ని కల్పించే ముఖ్యమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుంది అని ఎంపీ పేర్కొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *