లలిత్ ను ఆలస్యంగా వరించిన అదృష్టం…మొదటిసారిగా జరిగిన సెలెక్షన్స్ లో దక్కని స్థానం…
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన అండర్ 14 టాలెంట్ హంట్ లో వీరవిహారం చేసి సెలెక్టర్ దృష్టిని అమితంగా ఆకర్షించాడు.
నిత్యం మచిలీపట్నం లో ప్రముఖ కోచ్ గుబ్బల సుధాకర్ పర్యవేక్షణలో కఠోర సాధన చేసే లలిత్ ఎంపిక హర్షణీయం. మాజీ ప్రముఖ ఆటగాడు ప్రసాద్ సూచనలమేరకు తన టెక్నిక్ లను సరిచేసుకుంటూ నేడు తన కలను అందుకున్నాడు లలిత్.
లలిత్ తండ్రి పెద్దిరాజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జూనియర్ వారెంట్ అధికారిగా పనిచేసి ప్రస్తుతం మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి వెంకట లక్ష్మి గృహిణి.
లలిత్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ప్రాంతవాసి అయినా తండ్రి వృత్తి రీత్యా మచిలీపట్నం లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు.సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం లో 9 వ తరగతి చదివే లలిత్ చదువులోనూ 90% పై మాటే…
లలిత్ ఆంధ్రప్రదేశ్ అండర్ 14 టీం కు సెలెక్ట్ అవడంతో కోచ్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రికెట్ అభిమనులు సంబరాలు చేసుకున్నారు.