MachilipatnamLocal News
March 18, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం డివిజన్లో తెలుగు ఉపాధ్యాయులకు ఉగాది సన్మానాలు

  • March 18, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నం డివిజన్లో తెలుగు ఉపాధ్యాయులకు ఉగాది సన్మానాలు

మచిలీపట్నం:


        శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బ్రిగేడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో అప్స డివిజన్ అధ్యక్షులు మట్టా నరసయ్య, కార్యదర్శి కవిత, నవీన్, అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అప్స) మచిలీపట్నం డివిజన్ తరఫున…పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న 40 మంది తెలుగు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు ఘనమైనటువంటి సత్కారము చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మచిలీపట్నం డిపో మేనేజర్  పెద్దిరాజు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, హోమియో వైద్యులు నేతి ప్రభాకర్, తెలుగు పండితులు రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బందరు డివిజన్ సభ్యులందరూ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది.
       ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే తరానికి తెలుగు పట్ల ఆసక్తి కలుగుతుందని కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తెలియజేసినారు.
       ఈ కార్యక్రమంలో  ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ కొమరగిరి చంద్రశేఖర్, కౌన్సిల్ సభ్యులు సిహెచ్ఎస్ఎన్ రాజుగారు వి. సుందర రామయ్య, జిల్లా అధ్యక్షులు జాన్, అసోసియేషన్ సీనియర్ సభ్యులు వి నాగప్రవీణ్, కుమార్ బాబు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *