కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో పలు పరీక్షా ఫలితాలు విడుదల
మచిలీపట్నం :
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన యూజీ IV సెమిస్టర్, బీకాం, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, లా మరియు ఎడ్యుకేషన్ కోర్సుల వన్ టైమ్ అపర్చునిటీ పరీక్షల ఫలితాలతో పాటు ఎల్. ఎల్.బి / బి.బి.ఎల్. ఎల్.బి I & V సెమిస్టర్, ఎల్.ఎల్.ఎం I సెమిస్టర్ మరియు బి.ఎడ్ / డి.పి.ఎడ్ IV సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ప్రొఫెసర్ కూన రాంజీ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ku.ac.in లో పరిశీలించవచ్చని సూచించారు.
అలాగే, యూజీ IV సెమిస్టర్ మరియు ఎల్.ఎ / బి.వి.ఎన్. ఎల్.ఎమ్ I & V సెమిస్టర్, ఎల్.ఎల్.ఎం I సెమిస్టర్ మరియు బి.ఎడ్ / డి.పి.ఎడ్ IV సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా 10-06-2026 నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఫీజును చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని డా. పి. వీర బ్రహ్మచారి విజ్ఞప్తి చేశారు.

