కృష్ణా యూనివర్శిటీ పరిధిలో నిర్వహించిన యూజీ సెమిస్టర్ – 1 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ, బి.ఎడ్ & స్పెషల్ బి.ఎడ్ – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ జనవరి 2026 ఫలితాలను విశ్వవిద్యాలయం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
విద్యార్ధులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు..
వైస్ చాన్సలర్ కూన రాంజీ మాట్లాడుతూ, పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధ్యాపకులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు మరింత కృషి చేసి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ ఎన్ ఉష పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, సమర్ధవంతంగా జరిగినట్లు తెలిపారు.
పరీక్షల నియంత్రణాధికారి డా పి వీరబ్రహ్మచారి మాట్లాడుతూ, రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు.