MachilipatnamLocal News
February 28, 2026
పోలీస్ డైరీ

ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మీ కోసం కార్యక్రమం నిర్వహణ – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు

  • February 23, 2026
  • 0 min read
[addtoany]
ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మీ కోసం కార్యక్రమం నిర్వహణ – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు
మచిలీపట్నం :
 
మీకోసం కార్యక్రమానికి మొత్తం 48 ఫిర్యాదుల స్వీకరణ
 
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించటమే లక్ష్యంగా మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎవరైనా వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తూ అడిషనల్ ఎస్పీ అడ్మిన్  వివి నాయుడు  అన్నారు. 
 
ఈ ఈరోజు జిల్లా ఎస్పీ  విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ  జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారితో నేరుగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. 
 
 స్వీకరించిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం పూర్తిస్థాయి విచారణ జరిపి, సత్వర పరిష్కారం అందజేస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు లో గల సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి సత్వర పరిష్కారం అందించాల్సిందిగా తెలిపారు. 
 
ఈ రోజు నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా తక్షణ సహాయం అందించడం కృష్ణాజిల్లా పోలీస్ శాఖ యొక్క లక్ష్యమని తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *