MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు

  • February 23, 2026
  • 0 min read
[addtoany]
ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు
మచిలీపట్నం :
 
        ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయి. జిల్లాలో 24 వేల 173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. ద్వితీయ సంవ త్సరం విద్యార్థులు 25,406 మంది పరీక్షకు హాజరవ్వనున్నారని తెలిపారు.
       జిల్లాను 14 జోన్లుగా విభజించి 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 63 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 63 మంది డిపా ర్ట్మెంటల్ అధికారులు, 1,100 మంది ఇన్విజి లేటర్లు విధులు దశలవారీగా విధులు నిర్వహించారు. అదనంగా నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అధికారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు చివరి క్షణంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ట్రాఫిక్ లో చిక్కుకొని చివరి క్షణాల్లో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్ద దించి పరీక్ష బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హాల్ టికెట్ నెంబర్లను పరిశీలించి తమకు కేటాయించిన గదులలో పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 సెక్షన్లు అమలు చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *