సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ప్రజలందరికీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ మరింత ఆనందం పంచాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీక అని, ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని, పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు.