మచిలీపట్నం :
సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, వర్చువల్గా జిల్లా కలెక్టర్లతో జి ఎస్ డి పిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన ప్రజా సేవల మెరుగుదలకు సంబంధించిన ముఖ్య అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (జిఎస్డిపి), పరిపాలనా సంవర్థనకు పది సూత్రాలు (పది సూత్రాలు), ఆదాయార్జన శాఖల పనితీరు సమీక్ష, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు పురోగతి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (పిపిపీ) సహిత పెట్టుబడి ప్రతిపాదనల సమీక్ష, ఆర్టీజీఎస్ ద్వారా శాఖల ఫైళ్ళ పరిష్కార స్థితి, డిజిటల్ పరివర్తన వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆన్లైన్ సేవలు, రెవెన్యూ శాఖ కార్యకలాపాలు, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ, రెవిన్యూ సమస్యల పరిష్కారం, భూమి సర్వే, ‘వికసిత్ భారత్ – రోజగార్ మరియు అజీవికా మిషన్ (గ్రామీణ)’ పథకం వంటి వివిధ ప్రధాన విషయాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రగతి, మౌలిక సధుపాయాల మెరుగుదలకు దోహదపడే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేసే విధంగా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా నుంచి వర్చువల్గా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి పంచాయతీరాజ్ చేసి రమణ రావు డ్రామా పీడీ శివప్రసాద్ ఐ సి డి ఎస్ పి డి ఎంఎం రాణి హౌసింగ్ ఈఈ గృహ నిర్మాణ సంస్థ ఈఈ వెంకటరావు జెడ్పి సీఈవో కన్నమనాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.