సంక్రాంతి పండుగ సాంప్రదాయ ఆటలు

మచిలీపట్నం :
మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 డివిజన్ నందు గల ఇండోర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా, క్రీడలతో సాంప్రదాయ వేడుకలు, క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహపరితంగా సాగుతున్నాయి. ఈ పోటీలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, 45 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, పి. వి. ఫణి కుమార్ లు లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు.
యువత ఉత్సాహంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా, తాడు లాగుట, తొక్కుడు బిళ్ళ, ఏడు పెంకుల ఆట, కుర్చీలాట, కర్ర సాము, గాలిపటాల ఆటలు మొదలగు ఆటలతో ఎంతో ఉత్సాహంగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ జాతీయ క్రీడాకారుడు, బొమ్మిశెట్టి ప్రభు, ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్, కొత్త గుండు రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

