మచిలీపట్నం:
భావతరంగిణి ఆధ్వర్యంలో స్థానిక మహతి కళావేదికలో ఆదివారం సాయంత్రం జరిగిన సంక్రాంతి సందడి సరదాగా సాగింది.
లలిత, సినీ, జానపద గీతాలు, కూచిపూడి నాట్యాలు, హాస్య స్కిట్స్ , వదిన _మరదళ్ల హాస్య సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆలరించాయి రావినూతల సత్యనారాయణ అలనాటి మేటి సినీ గీతాలు ఆలపించగా, అల్లాడ శ్యామలత భోగి, గొబ్బెమ్మల పాటలు cఆలపించారు. పాటలకు అనుగుణంగా కొంతమంది మహిళలు నృత్యాలు చేశారు.
తుమ్మల షనయ సిరి, మేధశ్రీ లు రాధాకృష్ణుల నృత్యంచేయగా ,దేవిశ్రీ ప్రియ కూచిపూడి నాట్యం చేశారు అనంతరం భవిష్య రచించి దర్శకత్వం వహించిన హాస్య స్కిట్స్ “జలుబు వదలాలంటే , ఫోటోల పెళ్లిళ్లు,అడ్రస్ గందరగోళం, బ్యాంక్ చెక్, డాక్టర్ తెలివి ” మొదలైన హాస్య స్కిట్స్ ను
ఔత్సాహిక కళాకారులు రావినూతల వెంకటేశ్వరరావు , కోసూరు ఈశ్వరరావు, ఆర్.ఎస్ .నారాయణ, వై .శ్రీరామ్, శ్రీమతి పి.శాంతి బాల నటుడు చి కృష్ణ కౌండిన్య దత్ లు అభినయించారు.
వదిన మరదలు హాస్య సంభాషణలో హైదరాబాదుకు చెందిన చిలుకూరి నవ్య శ్రీ గాయత్రి,
జమ్మలమడక బిందు దత్త శ్రీ లు సరదా సరదా మాటలతో అందరినీ నవ్వించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ టి. పెద్దిరాజు , ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, త్యాగరాజ విద్యాపీఠం అధ్యక్షులు బిహెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి భావ తరంగిణి గౌరవఅధ్యక్షుడు కoచనపల్లి కృష్ణమోహన్ రావు ,భావ తరంగిణి అధ్యక్షులు భవిష్య, రోటరీ వెంకటేశ్వర్లు కళాకారులను అభినందించి జ్ఞాపకాలు బహుకరించారు.
llamcorper mattis, pulvinar dapibus leo.