కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు వాహనాల అవసరతను గుర్తించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) ద్వారా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 9 నూతన బొలెరో వాహనాలను శనివారం ఏలూరు రేంజ్ ఐ జి, జి.వి.జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కు అందించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ , పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తో కలిసి జండా ఊపి లాంఛనంగా వాహనాలను ప్రారంభించారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మొత్తం 13 వాహనాలను సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా సమకూర్చారు మీ వీటిలో అవనిగడ్డ సబ్ డివిజన్ కు నాలుగు వాహనాలను గతంలో అందజేశారు, మిగిలిన 9 వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నంలో ఐజిపి ఎస్పీకి అందించారు. వాహనాలను అందించిన దాతలైన లికిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ని సత్కరించి, కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఐజిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అదునాతన సాంకేతికతో కూడిన వాహనాలు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని,పోలీస్ శాఖలో ఉన్న అవసరతలను గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి చేసిన సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ వాహనాలన్నిటిని అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్లకు, పెడన రూరల్ పోలీస్ స్టేషన్ కు కేటాయించామన్నారు.
ఈ వాహనాలకు పోలీస్ శాఖ వెచ్చించే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి వినియోగించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. తద్వారా సిబ్బంది యొక్క అవసరతలను తీర్చడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ప్రజా రక్షణకు , నిరంతరం విధులు నిర్వహిస్తు, ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు నూతన వాహనాలను అందించి విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపయోగం గా ఉంటుందని తెలిపారు.